ప్రకాశం: జిల్లాలోని అద్దంకి మండలం ధేనువకొండకు చెందిన వేణు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఇలపావులూరుకు చెందిన పొలంలో గొర్రు తోలడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన జరిగిన సమయంలో పొలంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై స్పష్టత లేదని స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి


