హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన కౌన్సిలర్లు

MHBD: సమాచారం లేకుండా తీర్మానాలు చేస్తున్నారని తొర్రూరు మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని బీఆర్ఎస్ కౌన్సిలర్లు బహిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ... సమావేశం అజెండాను ముందుగా అందించకుండా కేవలం సమావేశానికి ఒక రోజు ముందు అందించడం సరికాదన్నారు. తొర్రూరు పట్టణంలో పారిశుధ్యం, అభివృద్ధి పనులపై మున్సిపల్ చైర్మన్, కమిషనర్ లకు పట్టింపులేదని మండిపడ్డారు.