హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వన్యప్రాణి వారోత్సవాల్లో అవగాహన కార్యక్రమాలు

WGL: వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా నర్సంపేట పట్టణంలో ఆదివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రేంజ్‌ కార్యాలయ పరిసరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమం, అనంతరం వన్యప్రాణుల సంరక్షణపై ర్యాలీ చేపట్టారు. పాకాల బయోడైవర్సిటీ పార్కులోనూ శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. అటవీ సిబ్బంది పాల్గొని ప్రజలకు వన్యప్రాణులు, జీవవైవిధ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.