KRNL: సెలవులు కలిసి రావడంతో మంత్రాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రాఘవేంద్ర కూడలి, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాద వితరణ కౌంటర్, తుంగభద్ర నదీ తీరంలో రద్దీ కనిపించింది. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద, సర్వదర్శన క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రాలయంలో భక్తుల భారీ రద్దీ


