హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కానింగ్ కేంద్రాలపై నిఘా పెంచాలి: కలెక్టర్

BPT: జిల్లాలో బాలికల జననాలు తక్కువగా నమోదవుతున్న యద్దనపూడి, చిన్నగంజాం, మార్టూరు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. స్కానింగ్ కేంద్రాలపై నిరంతరం నిఘా ఉంచాలని, అవసరమైన చోట డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, వాటిని అరికట్టేందుకు బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు.