ప్రకాశం: కొమరోలు మండలం పొట్టి రెడ్డిపల్లె ఎంపీపీ పాఠశాలను ఎంఈఓ-2 శ్రీనివాసరెడ్డి తనిఖీ చేశారు. పాఠశాల కార్యాలయంలోని రికార్డులను పరిశీలించిన అనంతరం విద్యార్థుల విద్యా సామర్థ్యాలను తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వంట కార్మికులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీ పాఠశాలను తనిఖీ చేసిన MEO


