హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాభావంతో ఎండిన పత్తి పంట

KRNL: వర్షాభావంతో పత్తి పంట ఎండిపోవడంతో కర్నూలు జిల్లా కోసిగి మండలం సాతనూరుకు చెందిన రైతు వడ్డే విశ్వనాథ్ తీవ్రంగా నష్టపోయారు. రెండెకరాల్లో పత్తి సాగు చేసినా వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పూత, కాయ దశలోనే పంట దెబ్బతింది. చేసేదిలేక పంటను గొర్రెల మేతకు వదిలేశారు. ప్రభుత్వం కోసిగిని కరవు మండలంగా ప్రకటించి, నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ఆయన కోరారు.