హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఫుట్‌బాల్ పోటీలు

AKP: ఇవాళ మునగపాక మండలం తిమ్మరాజుపేటలోని డావిన్సి పాఠశాలలో రాష్ట్రస్థాయి సెవెన్-ఎ ఫుట్‌బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 14 జట్లు పాల్గొంటున్నాయి. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.10,000, ద్వితీయ బహుమతిగా రూ.5,000 నగదుతో పాటు ఆకర్షణీయమైన షీల్డులను అందజేయనున్నారు.