MLG: తాడ్వాయి మండలం మేడారంలో జిల్లా సర్పంచుల సదస్సు నేడు నిర్వహించనున్నట్లు కన్వీనర్ ముసినిపెల్లి కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. సర్పంచుల హక్కులు, సమస్యల పరిష్కారానికి పార్టీలకతీతంగా ఐక్యంగా పోరాడాలని, సదస్సుకు జిల్లాలోని సర్పంచులందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
నేడు మేడారంలో జిల్లా సర్పంచుల సదస్సు


