SRPT: అనంతగిరి మండలం వెంకట్రామపురం గ్రామంలో తరచూ కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఈరోజు ఆరోపించారు. దోమల బెడదతో చిన్నారులు, వృద్ధులు అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
గ్రామంలో తరచూ కరెంటు కోతలు !!


