హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం మానలేక యువకుడి ఆత్మహత్య

PLD: ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన శ్రీనివాసరావు (32) మద్యం మానలేక మానసికంగా బాధపడుతూ పురుగుమందు తాగినట్లు బంధువులు తెలిపారు. కుటుంబ సభ్యులు సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.