హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతల రోడ్డుతో వాహనదారుల అవస్థలు!

RR: చింతలకుంట పరిధిలోని చింతలకుంట నుంచి సాగర్ చెక్‌పోస్టు రోడ్డుకు వెళ్లే మార్గంలో డ్రైనేజీ పనులు చేపట్టారు. పనులు పూర్తయినా రోడ్డును పూర్తిస్థాయిలో పునరుద్ధరించకపోవడంతో గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు, స్థానికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.