హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే

NLR: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో రూ. 2 కోట్ల 50 లక్షలతో శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పోట్టే పాలెం, దేవరపాలెం, కొమ్మరపూడి, సౌత్ మోపూరు, మనవరప్పాడు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే సిబ్బంది తెలియజేశారు.