హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పామూరులో రోడ్డు భద్రతపై అవగాహన

ప్రకాశం: పామూరు పట్టణంలోని తూర్పువీధిలో శనివారం రాత్రి ఎస్సై అనుక్‌ రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. గ్రామాల్లో రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్‌ నేరాలు, ఎన్నికల నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు.