హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైస్ మిల్లులో అధికారులు తనిఖీలు

NLR: భైంసా మండలం వానల్‌పాడ్‌లోని ఓ రైస్‌ మిల్లులో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 5,824.995 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొరత గుర్తించారు. రికార్డుల ప్రకారం 5,904.435 టన్నులు ఉండాల్సి ఉండగా.. 79.44 టన్నులు మాత్రమే లభ్యమయ్యాయి. పంచనామా నిర్వహించిన అధికారులు మిల్లర్‌పై క్రిమినల్‌ కేసు నమోదుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.