హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుపాకీతో బెదిరించారని ఫిర్యాదు

WNP: ఖిల్లాగణపురం మండలంలో భూ వ్యవహారంలో తలెత్తిన వివాదంతో గద్వాలకు చెందిన గట్టు చిన్నతిమ్మప్ప తుపాకీతో చంపుతానని బెదిరించినట్లు ఫిర్యాదు అందిందని ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు. ఈ నెల 1న ఫోన్‌లోనూ బెదిరించినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.