హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వయోవృద్ధుల హక్కుల అమలుకు ప్రత్యేక చర్యలు'

ASF: వయోవృద్ధుల సంక్షేమం, హక్కుల అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిత తెలిపారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వృద్ధులు భావితరాలకు దిక్సూచిలాంటివారని, వారి అనుభవాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సహాయం కోసం ఎల్డర్ లైన్ 14567 కాల్ చేయాలని తెలిపారు.