హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఇళ్ల బిల్లులు సకాలంలో చెల్లించాలి'

ASR: పీఎం జన్ మన్ ఇళ్ల బిల్లుల మంజూరులో జాప్యాన్ని నివారించాలని సీపీఎం మండల కార్యదర్శి బుజ్జిబాబు కోరారు. శనివారం జీకేవీధిలో నిరసన తెలిపారు. లబ్ధిదారులు అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్నా బిల్లులు రాక అసంపూర్తి ఇళ్లతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా కలెక్టర్, హౌసింగ్ అధికారులు స్పందించి పీఎం జన్ మన్ తో పాటు గ్రామీణ ఇళ్ల బిల్లులను మంజూరు చేయాలన్నారు.