హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీణవంకకు జాతీయస్థాయి గుర్తింపు

KNR: వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌కు చెందిన వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ లక్కాకుల శ్రీనివాస్ జాతీయస్థాయి అవార్డు అందుకున్నారు. సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ నిర్వహించిన ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ కాంటెస్ట్‌లో SAP HM రిబ్బన్ అవార్డుతో పాటు రూ.1,000 నగదు బహుమతి పొందారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో SAP ఫౌండర్ ఎంసీ శేఖర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.