హైదరాబాద్: 28°C
తెలంగాణ

నంబర్ నకిలీ కావొచ్చు.. జాగ్రత్త!

HYD: గూగుల్లో కనిపించే ప్రతి కస్టమర్ కేర్ నంబర్ నిజమైనది కాదని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. మోసగాళ్లు నకిలీ నంబర్లు ఏర్పాటు చేసి బ్యాంకు వివరాలను దొంగిలించే అవకాశం ఉందన్నారు. పేరు, OTP UPI PIN వంటి వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దని సూచించారు. కస్టమర్ కేర్ నంబర్ల కోసం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఆశ్రయించాలని, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు.