హైదరాబాద్: 28°C
తెలంగాణ

అప్పుల బాధతో వ్యక్తి బలవన్మరణం

MHBD: అప్పుల బాధతో సీరోలు మండలం కాంపల్లి చెందిన మంద చంద్రశేఖర్‌ (50) శనివారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుమార్తె వివాహం కోసం రూ.2.50 లక్షలు, ప్రమాదంలో గాయపడటంతో వైద్యం కోసం మరో రూ.50 వేలు అప్పు చేసినట్లు పోలీసులు తెలిపారు. పొలానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకుని కనిపించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.