హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి సేవిస్తున్న ఐదుగురిపై కేసు

BHPL: గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. శనివారం చిట్యాల మండలం జూకల్‌ శివారులోని కెనాల్‌ వద్ద గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల్లో గంజాయి సేవించినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పోచంపల్లి సతీశ్‌ తెలిపారు.