JN: వర్షాకాలం పూర్తయినా కొడకండ్ల బయ్యన్న రిజర్వాయర్‌కు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీరు చేరకపోవడంతో ప్రధాన కాల్వ ఎండిపోయి చెట్లు పెరుగుతున్నాయి. కాల్వకు ఇరువైపులా వరి సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కాల్వ నీటితో చెరువులు, కుంటలు నింపడంతో భూగర్భజలాలు పెరిగేవని రైతులు తెలిపారు. కాల్వలో నీటి జాడ లేకపోవడం కరవు పరిస్థితులను తలపిస్తున్నాయి.
తెలంగాణ
'వర్షాకాలం ముగిసినా.. రిజర్వాయర్‌కు నీరు రాలేదు'


