హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ ఉత్సవం

BPT: వేటపాలెం మండలంలోని జీవరక్షానగర్, రామానగర్ అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవంలో భాగంగా అంగన్‌వాడీ ఉత్సవం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సజ్జా లీలావతి హాజరై చిన్నారుల ఎదుగుదలకు మునగ ఆకు, ఆకుకూరల అవసరాన్ని వివరిస్తూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండి పౌష్టికాహారం అందించాలని సూచించారు.