హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండెపోటుతో సీపీఐ నాయకుడు మృతి

BDK: జూలూరుపాడు మండలం వెంగన్నపాలెంలో కూతురి పెళ్లయిన 3 రోజులకే తండ్రి గుండెపోటుతో మృతి చెందారు. సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ నేత, టీయూసీఐ కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షుడు రాయల సుధాకర్ (48) శనివారం కన్నుమూశారు. గత నెల 30న కుమార్తె శివాని వివాహం జరిపించిన ఆయన గుండెపోటుకు గురై మృతి చెందారు. కూతురి కాళ్ల పారాణి ఆరకముందే తండ్రి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.