హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గాలింపు చర్యలను వేగవంతం చేయాలి'

E.G: తాళ్లపూడిలో హత్యకు గురైన మహిళ మృతదేహం కోసం గోదావరి నదిలో గాలింపు చర్యలను వేగవంతం చేయాలని శనివారం కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు రెస్క్యూ టీం సిబ్బందిని కోరారు. బాధిత కుటుంబ సభ్యుల ఆవేదనను దృష్టిలో ఉంచుకొని గాలింపును ముమ్మరం చేయాలని ఆయన సూచించారు. రెస్క్యూ టీంను కలిసి, గాలింపులో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.