హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలలో పోలీసులు తనిఖీలు

KKD: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భీమవరపుకోట ZPHS పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను శనివారం పోలీసులు పరిశీలించారు. SP బిందు మాధవ్ రాజ్ ఆదేశాలతో, DSP ఏ.బి.జి. తిలక్ పర్యవేక్షణలో తుని రూరల్ CI చెన్నకేశవరావు, SI టి. రామకృష్ణ భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు గ్రామస్థులు పోలీసులకు సహకరించాలని వారు సూచించారు.