హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోవా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

NLG: గోవా నుంచి నల్గొండకు అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అరెస్ట్ చేశారు. నార్కట్‌పల్లి–నల్లగొండ రోడ్డులో శనివారం సాయంత్రం తనిఖీలు నిర్వహించగా కారులో మద్యం బాటిళ్లు గుర్తించారు. అతని వద్ద  ఉన్న 30 గోవా మద్యం బాటిళ్లతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు.