హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెల్ట్‌ షాపులను బంద్ చేయాలని వినతి పత్రం

SRPT: తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో కొనసాగుతున్న బెల్ట్‌ షాపులను బంద్‌ చేయాలని కోరుతూతుంగతుర్తి ఎక్సైజ్‌ ఎస్సై శిరీషకి గ్రామస్తులు శనివారం వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో బెల్ట్‌ షాపుల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా యువతపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. ఊరిలో బెల్ట్ షాపులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.