హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివీస్‌ ల్యాబొరేటరీస్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

BHNG :చౌటుప్పల్‌ మండలంలోని మూడు పాఠశాలలకు చెందిన 260 మంది విద్యార్థులకు దివీస్‌ ల్యాబొరేటరీస్‌ ఆధ్వర్యంలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్లు జయంత్‌కుమార్‌, నరేష్‌ విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు అందించారు. అలాగే రూ.1,66,088 విలువైన నోట్‌ పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు.