హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి పోటీలకు గంగాయపల్లె విద్యార్థిని ఎంపిక

KDP: వల్లూరు మండలం గంగాయపల్లె ఆదర్శ పాఠశాలకు చెందిన ఇంటర్ విద్యార్థిని రజిత జిమ్నాస్టిక్ పోటీల్లో జిల్లా స్థాయిలో విజేతగా నిలిచింది. కడప స్పోర్ట్స్ పాఠశాలలో శనివారం నిర్వహించిన అండర్‌–19 బాలికల జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా రజితను పీఈటీ సుశీలమ్మ, ప్రిన్సిపల్ సురేష్, ఉపాధ్యాయులు అభినందించారు.