NLG: చిట్యాల మండలం జూకల్ గ్రామంలో గంజాయి సేవిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కెనాల్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో కొందరు గంజాయి సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారన్న సమాచారంతో ఎస్సై ఓంపాల్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన ఐదుగురిని వెంబడించి పట్టుకుని అరెస్ట్ చేశారు.
తెలంగాణ
జూకల్‌లో గంజాయి సేవిస్తున్న ఐదుగురు అరెస్ట్


