హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చౌడేశ్వరి దేవికి ఘనంగా పూజలు

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక పూలమాలలతో అలంకరించారు. అభిషేకాలు, కుంకుమార్చన తదితర పూజలు చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.