SRD: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి సుందరయ్య భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తూ బీజేపీకి కొమ్ముకాస్తోందని మండిపడ్డారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను తొలగించే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
ఈసీని తొలగించకుంటే ఆందోళన తీవ్రం: సీపీఎం


