హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ. 2 కోట్లతో జంక్షన్ల సుందరీకరణ

మెదక్ పట్టణాన్ని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు రూ.2 కోట్లతో మూడు సర్కిళ్లను ఆధునీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వెల్లడించారు. ఈ పనుల మోడల్ డిజైన్లను ఆయన ఆవిష్కరించారు. రామాయంపేట సహా నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను అమలు చేస్తామని పేర్కొన్నారు.