హైదరాబాద్: 28°C
తెలంగాణ

శేషారెడ్డికి మరోసారి కాంగ్రెస్ బాధ్యతలు

MDK: అల్లాదుర్గం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొప్పుల శేషారెడ్డి పునర్నియమితులయ్యారు. 2014 నుంచి పార్టీ అభివృద్ధికి శ్రమిస్తున్న ఆయన సేవలను గుర్తించిన అధిష్ఠానం మరల అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. ఈ సందర్భంగా శేషారెడ్డికి పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని శేషారెడ్డి పేర్కొన్నారు.