హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిషన్‌ భగీరథ పైప్‌ లీకేజీ

GDWL: ఎర్రవల్లి మండలం కొండేరు శివారు కొట్టం ఇంజినీరింగ్‌ కాలేజీ సమీపంలో మిషన్‌ భగీరథ పైప్‌ లీకేజీతో తాగునీరు వృథా అవుతోంది. 44వ జాతీయ రహదారి అంచున నీరు వృథా అవుతుండటంతో గ్రామాలకు సరఫరా తగ్గుతోందని స్థానికులు, రైతులు తెలిపారు. తాగునీటి ఎద్దడి ఏర్పడుతోందన్నారు. అధికారులు వెంటనే పైప్‌ మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.