హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్

MHBD: పట్టణ ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేసే తాగునీటికి ఇవాళ అంతరాయం కలగనుంది. ప్రధాన పైపులైన్ మరమ్మతుల పనుల కారణంగా ఇవాళ నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు కమిషనర్ వినోద్ కుమార్ తెలిపారు. మరమ్మతులు పూర్తయిన అనంతరం సరఫరాను యథావిధిగా పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ముందస్తుగా తాగునీటిని నిల్వ చేసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేశారు.