హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గన్నవరం ఆర్టీసీ డిపోకు 45 నూతన ఎలక్ట్రిక్ బస్సులు

కృష్ణా: గన్నవరం ఆర్టీసీ డిపోకు రాష్ట్ర ప్రభుత్వం 45 నూతన ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట్లు డిపో మేనేజర్ రాంబాబు తెలిపారు. శ్రీశైలానికి 20, విజయవాడకు 11, కొండపల్లికి 4, కంకిపాడుకు 3, హనుమాన్‌జంక్షన్-విజయవాడ మార్గానికి 7 చొప్పున బస్సులను కేటాయించామని చెప్పారు. పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించేందుకు ఈ సర్వీసులు నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.