హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్నకొండ సింగిల్ విండో ఛైర్మన్‌గా మనోహర్

KNR: చొప్పదండి మండలం ఆర్నకొండ సింగిల్ విండో ఛైర్మన్‌గా చిట్యాలపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఎన్నం మనోహర్ నియమితులయ్యారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పదవికి పలువురు పోటీ పడగా మనోహర్‌కు అవకాశం దక్కింది. సింగిల్ విండో పరిధిలో మంగళపల్లి, చిట్యాలపల్లి, రేవల్లి తదితర గ్రామాలు ఉన్నాయి. నియామకంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.