హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇళ్లలోకి పాములు.. భయాందోళనలో ప్రజలు

RR: షాద్‌నగర్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో ఖాళీ ప్లాట్లు పిచ్చి చెట్లతో నిండిపోవడంతో విషసర్పాలకు ఆవాసాలుగా మారాయి. పాములు ఇళ్లలోకి, సీసీ రోడ్లపైకి వస్తుండటంతో చిన్నారులు, మహిళలు భయాందోళన చెందుతున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ఖాళీ ప్లాట్లను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.