NRML: జిల్లాలో అక్టోబర్ 5న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యటనల నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ విషయమై శనివారం అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలీసు బందోబస్తు, ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ కార్యక్రమంలో ఉన్నారు.
తెలంగాణ
మంత్రుల పర్యటనపై కలెక్టర్ సమావేశం


