హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిహారం కోసం నిర్వాసితుల డిమాండ్

NRPT: మక్తల్–NRPT–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు లగచర్ల, హకీంపేట రైతుల తరహాలో పరిహారం అందించాలని నిర్వాసితుల సంఘం కోరింది. నారాయణపేటలో మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, రూ.3 లక్షల బోనస్‌, పాడి పరిశ్రమకు రుణాలు కల్పించాలని కోరారు.