హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నట్లు క్యాంపు కార్యాలయ ఇంఛార్జి దయాకర్‌రెడ్డి తెలిపారు. ఉదయం ఖమ్మంలో కళ్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేస్తారు. 11 గంటలకు తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం కామంచికల్‌, ఏన్కూరులో ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు.