హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోమవారం ప్రజావాణి రద్దు

ASF: ఈ నెల 5న ఆసిఫాబాద్‌లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ హరిత తెలిపారు. నిర్మల్ జిల్లాలో నిర్వహించనున్న ఉమ్మడి జిల్లా సమావేశానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.