హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒకే పాస్‌తో ఆర్టీసీ-మెట్రో జర్నీ!

HYD: ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా RTC-మెట్రో కామన్ పాస్ తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మెట్రోలో ప్రయాణించి ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకున్నామని చెప్పారు. ఒకే పాస్‌తో ఆర్టీసీ, మెట్రో సేవలను వినియోగించుకోవచ్చని, దీంతో ప్రయాణికులకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పాస్‌ను మరింత మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.