GDWL: ధరూర్ మండలం పెద్దపాడు, వామనపల్లి గ్రామాల్లో శనివారం నిర్వహించిన చేయూత దివ్యాంగుల పింఛన్ల ధ్రువీకరణ ప్రక్రియను అదనపు కలెక్టర్ బి. నర్సింగరావు పరిశీలించారు. అర్హులైన దివ్యాంగులకు సంక్షేమ ఫలాలు అందేలా ధ్రువపత్రాల పరిశీలనను నిబంధనల ప్రకారం పారదర్శకంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు.
తెలంగాణ
దివ్యాంగుల పింఛన్ల ధ్రువీకరణ పరిశీలన


