హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీపీ గౌస్ ఆలంకు నవరాత్రి ఉత్సవాల ఆహ్వానం

కరీంనగర్ టవర్ సర్కిల్‌లో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నిర్వహించే దుర్గా నవరాత్రి ఉత్సవాలకు సీపీ గౌస్ ఆలంను మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆహ్వానించారు. సీపీని మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.