WNP: గోపాల్ పేట మండలం తాడిపర్తి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు రెండో విడత యూనిఫామ్‌ను పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయుడు నారాయణ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ లోకారెడ్డి పాల్గొని విద్యార్థులు శ్రద్ధగా చదివి గ్రామానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఉపసర్పంచ్ రామచంద్రయ్య యాదవ్, కార్యదర్శి సాయికృష్ణ, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ.!


