SDPT: గజ్వేల్ మండలం మక్త మాసాన్‌పల్లిలో 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఓవర్‌హెడ్ మంచినీటి ట్యాంక్ శిథిలావస్థకు చేరింది. ట్యాంకుకు పగుళ్లు ఏర్పడి, ఇనుప చువ్వలు బయటకు వచ్చి తుప్పు పట్టాయి. దీంతో ఎప్పుడు కూలుతుందోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ట్యాంకును పరిశీలించి, ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
శిథిలావస్థలో ఓవర్‌హెడ్ ట్యాంక్


